VIDEO: మొలకెత్తిన మొక్కజొన్న.. ఆందోళనలో రైతన్న
KMR: గాంధారి మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట తడిసిపోవడంతో మొలకలు వచ్చాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా మొక్కజొన్న పంట దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి కోరుతున్నారు.