హైదరాబాద్ జంట జలాశయాలకు వరద

హైదరాబాద్ జంట జలాశయాలకు వరద

TG: HYDలోని జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేయగా.. ఇన్‌‌ఫ్లో 1200, ఔట్‌‌ఫ్లో 3,072 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేయగా, ఇన్‌‌ఫ్లో 300, ఔట్‌‌ఫ్లో 5,215 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.