ఈవీఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
SDPT: కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ గోదాంని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్శనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎంగోదాంను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్లను భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్లలను పరిశీలించారు.