ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: చమర్తి
అన్నమయ్య: ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని రాజంపేట TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు అర్జీల రూపంలో విన్నవించారు. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన చరవాణిలో మాట్లాడి వాటిని పరిష్కరించాలని సూచించారు.