జిల్లా మీదగా నడిచే ప్యాసింజర్ రైళ్లు రద్దు

జిల్లా మీదగా నడిచే ప్యాసింజర్ రైళ్లు రద్దు

శ్రీకాకుళం: జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ తెలిపింది. జిల్లా  మీదుగా నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం-పలాస(67289), పలాస-విశాఖపట్నం(67290), బ్రహ్మపుర-విశాఖపట్నం(18525) ఎక్స్‌ప్రెస్ రైళ్లను శుక్రవారం రద్దు చేసింది. ఒక్కసారిగా రద్దు చేయడంతో జిల్లా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.