చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

BDK: పాల్వంచ తెలంగాణ నగర్‌కు చెందిన లారీ యజమాని రామ్సింగ్ ఠాకూర్ (44) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈనెల 19న బస్టాండ్ సమీపంలో ఆటో దిగి రోడ్డు దాటుతుండగా, ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. మొదట సీహెచ్సీకి, ఆపై మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా, చికిత్స మధ్యలో మరణించారు.