ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు
NRPT: కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామంలో ఇవాళ కురువ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక బీరప్ప దేవాలయంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కనకదాసు సంఘం నాయకులు వీ. శంకర్ మాట్లాడుతూ.. సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని, ఆయన బాటలో అందరూ పయనించాలన్నారు.