మదనపల్లె ఎస్పీని కలిసిన రూరల్ సర్కిల్ సీఐ
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని శుక్రవారం మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రవి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా బదిలీల అనంతరం విధుల్లో చేరిన కొత్త సీఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పలువురు సీఐలను ఉద్దేశించి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు.