మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిన అధికారులు
PLD: నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. గురజాలలో వైసీపీ తలపెట్టిన రైతు ర్యాలీకి అనుమతి లేదంటూ ముందస్తు చర్యల్లో భాగంగా కాసును ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. గురజాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.