బుసక తొలకలతో రైతులకు తప్పిని తిప్పలు

బుసక తొలకలతో రైతులకు తప్పిని తిప్పలు

కృష్ణా: మైలవరం మండలం సబ్జపాడులో బుసక బకాసురులు రెచ్చిపోతున్నారు. వాగులో జేసీపీలతో బుసక తోడడం వల్ల వందల ఎకరాల తోటలకు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు పెరగడంతో పైరును కాపాడుకునేందుకు నీళ్లు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే వాగు మొత్తం పీల్చుకుంటోందని వారు తెలిపారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.