అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారానికై మానవహారం

VZM: ఎస్ కోట పట్టణ కేంద్రంలో ఐసీడీఎస్ సిబ్బంది కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఆన్‌లైన్ వద్దు ఆఫ్‌లైన్ ముద్దు అనే నినాదంతో స్థానిక ఆర్టీసీ డిపో వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల అధ్యక్షురాలు మాణిక్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల శ్రమను దోచుకుంటుందని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామన్నారు.