నేటి నుంచి సెంట్రల్ పార్క్‌లో పుష్ప ప్రదర్శన
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా నగరంలోని సెంట్రల్ పార్క్‌లో పుష్ప ప్రదర్శన ఇవాళ ప్రారంభిస్తారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో దేశ, విదేశీ రకాల హైబ్రిడ్ పూలను ప్రదర్శిస్తున్నారు. బెంగళూరు, కోల్కతా, కడియం నుంచి రప్పించిన ఆకర్షణీయమైన పూలు సందర్శకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు పలు ఆకర్షణలను జోడించారు.