ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే
NLG: కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో IKP & PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన ప్రతి గింజను వేగంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైతులకు పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.