వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: చెల్లుబోయిన
E.G: రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో తూ.గో జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడం కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెల్లుబోయిన సూచించారు.