షీలానగర్‌లో వైభవంగా వెంకన్నకు తోమాల సేవ

VSP: షీలానగర్ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రంలో శనివారం తోమాల సేవ విశేషంగా నిర్వహించారు. ప్రాతఃకాలం సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో పుష్ప మాలలతో ఆలయ ప్రదక్షిణ చేసి అర్చక స్వాములకు అందజేశారు. అర్చకులు స్వామివారికి పుష్పాలను అలంకరించి తోమాల సేవ విశేషంగా నిర్వహించి నక్షత్ర హారతులను సమర్పించారు.