బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్

బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్

బెంగళూరులో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి బెంగళూరులో రెండో ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు రూ.450 కోట్లతో ORRను కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 7 దేశాల విమానాశ్రయాల అభివృద్ధికి రూ.1,593 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.