వ్యక్తిత్వ వికాస తరగతులను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26, 27వ తేదీలలో స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని వార్డు సచివాలయ కార్యదర్శులతో పాటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు.