ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలి: PYL
GDWL: భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు స్వప్నించిన సమసమాజ స్థాపన కోసం నేటి యువత గంజాయి, మాదకద్రవ్యాల మత్తు వీడి పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలి అని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య అన్నారు. మంగళవారం గద్వాలలో భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల గోడపత్రికను పలు సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మార్చి 30 వరకు వర్ధంతి సభలు ఉంటాయన్నారు.