రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5 ని.లు ఆలస్యమైనా అనుమతి
MNCL: రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9.35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను హాలులోకి అనుమతిస్తామని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని స్పష్టం చేశారు.