జిల్లాలో రేపు మంత్రి తుమ్మల పర్యటన

KMM: జిల్లాలో మంత్రి తుమ్మల రేపు బుధవారం పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయం సభ్యుడు రంజిత్ కుమార్ తెలిపారు. రఘునాధపాలెం చింతకుర్తి గ్రామంలో ఉదయం 9 గంటలకు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం సత్తుపల్లి మండలంలోని బేతంపల్లిలో ఉ. 11 గంటలకు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.