చింతపల్లిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
ASR: చింతపల్లిలో గురువారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం 17 డిగ్రీలు నమోదు కాగా, గురువారం 12 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా దిగజారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చలికి ప్రజలు గజగజలాడుతున్నారు.