ఏ చర్య తీసుకున్నా.. కాంగ్రెస్ మద్దతిస్తుంది: ఎంపీ

ఆర్మీ, వాయుసేన సామర్థ్యాలను కాంగ్రెస్ నేతలు తక్కువ అంచనా వేస్తున్నారని ఢిల్లీ మంత్రి మాజిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగాయనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పాక్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా.. కాంగ్రెస్ మద్దతునిస్తుందని వ్యాఖ్యానించారు.