ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

కోనసీమ: యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కే.గోపాలకృష్ణా రెడ్డి ఆద్వర్యంలో మండపేట పట్టణంలో యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. యూటీఎఫ్ సీనియర్ నాయకులు జె.విశ్వాస్ కుమార్, సీహెచ్.శ్రీహరి రావు యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. పాత తరం నాయకులు ఎన్నో పోరాటాలు చేసి సాధించిన హక్కులను నిలబెట్టుకోవాలని సూచించారు.