500 కేజీల పీడీఎస్ బియ్యం పట్టివేత
AKP: రోలుగుంట మండలం కె.నాయుడుపాలెంలో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల పీడీఎస్ బియ్యాన్ని తహసీల్దార్ నాగమ్మ బుధవారం సాయంత్రం స్వాధీనం చేశారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ రామ్మూర్తి పాల్గొన్నారు. స్వాధీనం చేసిన బియ్యాన్ని గోదాంలో నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేశారు.