15 రోజుల పాటు అమెరికా పర్యటనకు MLC కవిత

NZB: 15 రోజుల పాటు అమెరికా పర్యటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు. ఆమె తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో గ్రాడ్యుయేషన్‌లో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్నారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు ప్రయాణం కానున్నారు.