భువనగిరి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్

నల్గొండ: మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బూర నర్సయ్య గౌడ్ కు భువనగిరి ఎంపీ టికెట్ బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈయన గతంలో 2014లో భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై గెలిచారు. 2019లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మూడోసారి ఆయన ఎంపీగా బరిలో దిగనున్నారు.