మిడ్జిల్‌లో ఎండిపోతున్న పంటలు.. నిలిచిన కల్వకుర్తి నీళ్లు
MBNR: మిడ్జిల్ మండలంలో 10 రోజులుగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆధారపడి సాగు చేసిన 10 వేల ఎకరాల వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. మరో 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా నీరు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు స్పందించి కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.