కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్షా పథకం అదనపు సమన్వయకర్త శైలజ పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు గడువు ఉంటుందని తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి కేజీబీవీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.