జీతాలు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన 108 పైలెట్లు
CTR: పుంగనూరు మండలాలలో 108 సర్వీసులలో పనిచేస్తున్న ఈఎంటీలు, పైలట్లకు ఈనెల వేతనంతో పాటు రెండు వేల రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో శుక్రవారం 108 పైలెట్లు, ఈఎంటీలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.