రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

NDL: కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు. ఫిర్యాదు స్థితి తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1100 లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందొచ్చని అన్నారు.