బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి
NLR: అల్లూరు (M) సింగపేట వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బొలెరో వాహనం బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు కావలి (M) బట్టలదిన్నె గ్రామానికి చెందిన ఉప్పాల సీనయ్య, బండ్ల ప్రసాద్‌గా గుర్తించారు. వీరంతా ఇంటి స్లాబ్ పనులకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలపారు.