VIDEO: మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఆరుగురుపై కేసు నమోదు
RR: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎన్టీఎఫ్ఎ టీం అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు. రెండు కేసుల్లో మొత్తం 52 నాన్-డ్యూటీ పేడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇనోవా వాహనాన్ని సీజ్ చేశారు. ఢిల్లీ, గోవా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం మేరకు జరిగిన తనిఖీల్లో అక్రమ రవాణా బయటపడింది.