జాతీయ క్రీడా దినోత్సవ రన్ ఘనంగా ప్రారంభం

జాతీయ క్రీడా దినోత్సవ రన్ ఘనంగా ప్రారంభం

BHPL: జిల్లా కేంద్రంలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవ రన్ నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథులుగా పాల్గొని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.