విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

SDPT: అక్కన్నపేట మండలం గండిపల్లి పరిధి హతీరాం అంబనాయక్ తండాకు చెందిన భూక్య భాస్కర్ కరీంనగర్ విద్యుత్ శాఖలో గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో హైటెన్షన్ స్తంభంపై మరమ్మతు చేస్తుండగా, విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.