కాకతీయ శైలికి చెందిన శిల్పం గుర్తింపు
MDK: చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.