అమ్మకానికి బైక్.. కానిస్టేబుల్ సస్పెండ్

అమ్మకానికి బైక్.. కానిస్టేబుల్ సస్పెండ్

కామారెడ్డి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న PC విశ్వనాథం సస్పెండ్ అయ్యాడు. విధుల సమయంలో కానిస్టేబుల్ చోరీకి గురైన బైక్ రికవరీ చేసి అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న SP రాజేష్ చంద్ర ఇవాళ విచారణకు ఆదేశించారు. బైక్​ను ఎలాంటి అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లాడని, తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడమే కాకుండా ఒక మెకానిక్ షాప్ వద్ద ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు.