భక్తి శ్రద్ధలతో శివరామనామ జపాయజ్ఞ గీతాజ్ఞాన యజ్ఞం

భక్తి శ్రద్ధలతో శివరామనామ జపాయజ్ఞ గీతాజ్ఞాన యజ్ఞం

NRPT: మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో  శ్రీ శివరామనామ జపాయజ్ఞ గీతాజ్ఞాన యజ్ఞం అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ నందగిరి స్వాముల వారు, శ్రీ శ్రీ శ్రీ రమణానందగిరిస్వాముల వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భజన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.