ఎంపీ ప్రశ్నకు.. కేంద్ర మంత్రి సమాధానమిదే

NTR: గత ఐదేళ్లలో APలోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం రూ.529.14 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. సోమవారం లోక్‌సభలో MP కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా మంత్రి స్పందించారు. ఉద్యోగ నియామకాల్లో కొద్దిపాటి ఖాళీలు ఉన్నప్పటికీ, రెండింటిలోనూ బోధన కొనసాగుతోందని తెలిపారు.