రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
SDPT: తొగుట మండలం తుక్కాపూర్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సెక్షన్ ఏఈ ఆకుల శ్రీధర్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.