చైన్ స్నాచింగ్ నిందితుడు అరెస్ట్

ELR: కైకలూరు మండలం వేమవరపాడుకి చెందిన మోజేశ్ (34) వృద్ధురాలు బోడావుల గంగా మహాలక్ష్మి మెడలోని బంగారు నానుతాడు లాక్కుని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుంచి 3 కాసుల బంగారం, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.