VIDEO VIRAL: చైనా మరో అద్భుత ప్రయోగం
చైనా శాస్త్రవేత్తలు చీకట్లో స్వయం ప్రకాశితమయ్యే 'బయోల్యూమినిసెంట్' మొక్కలను సృష్టించారు. మిణుగురు పురుగుల్లో ఉండే ల్యూసిఫెరేస్ ఎంజైమ్‌ను మొక్కల జన్యువుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వీటిని అభివృద్ధి చేశారు. వీటికి విద్యుత్ అవసరం లేదు. నీరు, ఎరువులు ఉంటే మెరుస్తాయి. ప్రయోగదశలో ఉన్న ఈ మొక్కలను భవిష్యత్తులో వీధి దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. తద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.