'స్వచ్ఛ ఫ్రైడే -డ్రైడే' కార్యక్రమం
PDPL: కమాన్పూర్‌లోని గోకుల్ నగర్ పరిధిలో సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ ఫ్రైడే -డ్రైడే' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మారుతి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.