VIDEO: విజయనగరం జిల్లా టాపర్‌గా బొబ్బిలి విద్యార్థి

VZM: పదో తరగతి ఫలితాలలో విజయనగరం జిల్లా టాపర్‌గా బొబ్బిలి విద్యార్థి పక్కి సాయి విజయ్ నిలిచాడు. బొబ్బిలికి చెందిన సాయి విజయ్ పట్టణంలోని అభ్యుదయ పాఠశాలలో చదివి 596 మార్కులు సాధించాడు. సాయి వినయ్ తండ్రి రమణమూర్తి అదే పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్నారు. జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థికి పాఠశాల సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు.