మారెమ్మపల్లిలో విద్యుత్ బిల్ కలెక్టర్‌పై దాడి..!
ATP: రాయదుర్గంలోని మారెమ్మపల్లిలో విద్యుత్ బిల్లు కలెక్టర్ రమేష్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అయితే రూ.90లు అదనపు వసూళ్ల వివాదమే దీనికి కారణమని తెలిసింది. ఆంజనేయులు, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు రమేష్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అతడి చొక్కా చిరిగి, తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.