జమ్మూకశ్మీర్ పేలుడు.. వైరల్‌గా సీసీటీవీ ఫుటేజ్

జమ్మూకశ్మీర్ పేలుడు.. వైరల్‌గా సీసీటీవీ ఫుటేజ్

జమ్మూకశ్మీర్ నవ్గామ్ PSలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన CCTV దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో పేలుడు తీవ్రత, దాని విస్తృతి ఎంత భారీగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెప్పారు. కాగా ఇది ఉగ్రదాడి కాదని.. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని జమ్మూ పోలీసులు తెలిపారు.