స్వామివారికి బంగారు హారం బహుకరణ

W.G: కాళ్ళ మండలం కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ భీమవరం వాస్తవ్యులు శ్రీ కఠారి శ్రీనివాస రాజు, సూర్యకుమారి దంపతులు 71 గ్రాములతో రూ. 6.8 లక్షల విలువ గల 2 వరసల లక్ష్మీదేవి లాకెట్ (బంగారు హారము) దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో స్వామి వారికీ అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి వారి శేష వస్త్ర ప్రసాదాలు అందించారు.