ఈనెల 12 వరకు రైతుల అభ్యంతరాలు స్వీకరణ

ఈనెల 12 వరకు రైతుల అభ్యంతరాలు స్వీకరణ

KKD: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి నమోదు చేసిన ఈ-పంట వివరాల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో ప్రచురిస్తున్నారు. ఖాతా నంబరు తప్పుగా నమోదైనా, విస్తీర్ణం తగ్గినా, పేర్లు సక్రమంగా లేకున్నా వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్. విజయ్ కుమార్ సూచించారు. ఈనెల 12 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.