అంగన్వాడీ మెయిన్ టీచర్లకు ప్రమోషన్
ELR: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఏలూరు పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు మినీ అంగనవాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో అపాయింట్మెంట్ లెటర్లను ఎమ్మెల్యే శుక్రవారం అభ్యర్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీడీపీఓ పద్మావతి పాల్గొన్నారు.