రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: ఎస్పీ

రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: ఎస్పీ

SRPT: రైతులు రహదారులపై ధాన్యం ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ధాన్యం కుప్పల వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో పశువులను రోడ్లపైకి వదలవద్దని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఈరోజు ఎస్పీ ఆదేశించారు.