మీ MOUలతో మాకు నమ్మకం లేదు: షర్మిల
AP: సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సీఐఐ సమ్మిట్ పేరుతో చంద్రబాబు కొడుతున్నది డబ్బా అని, విజన్ లేదని, పట్టుదల అంతకన్నా లేదన్నారు. 17 నెలల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చేస్తున్నది హంగామా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి MoUల పేరుతో జరగుతున్నది మోసమేనన్నారు.